35వేల తరగతి గదులు సిద్ధం చేశారా?: లోకేశ్‌

తాజా వార్తలు

Updated : 24/06/2021 16:13 IST

35వేల తరగతి గదులు సిద్ధం చేశారా?: లోకేశ్‌

అమరావతి: కనీస ఏర్పాట్లు, విద్యార్థుల ప్రాణాలకు రక్షణ చర్యలు చేపట్టకుండా మొండి పట్టుదలతో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏముందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. విద్యార్థుల ప్రాణాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి లెక్కలేదనే విషయం సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో స్పష్టమైందన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి సమగ్ర వివరాలు, ప్రణాళికలేని అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ ప్రకారం పరీక్షల నిర్వహణకు ఉండాల్సిన 35వేల తరగతి గదులను సిద్ధం చేశారా? అని ప్రశ్నించారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడితే పోయే ఒక్కో ప్రాణానికి కోటి రూపాయలు పరిహారంగా చెల్లించాలని న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ తీరుకు అద్దంపడుతున్నాయన్నారు. చేసిన తప్పు సరిదిద్దుకొని తక్షణమే పరీక్షల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు తెలపాలని హితవు పలికారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని