‘జగన్‌ మాస్కు పెట్టుకోరు..పెట్టుకోనివ్వరు’

తాజా వార్తలు

Published : 24/09/2020 12:36 IST

‘జగన్‌ మాస్కు పెట్టుకోరు..పెట్టుకోనివ్వరు’

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ 

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శలు గుప్పించారు. మూర్ఖత్వానికి ప్రతి రూపంగా జగన్‌ మిగిలిపోయారని ట్విటర్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షల్లో కరోనా కేసులు, వేల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. సీఎం జగన్‌ మాస్కు పెట్టుకోకపోగా వేరే వాళ్లు పెట్టుకుంటే ఊరుకోరని ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన దళిత యువకుడు కిరణ్‌ మాస్క్‌ పెట్టుకోలేదన్న కారణంతో పోలీసులు విచక్షణా రహితంగా కొట్టి చంపడమెందుకని ప్రశ్నించారు.   కిరణ్‌ మృతి ఘటన.. మాస్క్‌ పెట్టుకోనందుకా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అని లోకేశ్‌ నిలదీశారు.తిరుమల పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రితో ఫొటో దిగేందుకు మాస్కు పెట్టుకుని వచ్చిన వారిని మాస్కు తీసేయాలంటూ జగన్‌ ఆదేశించిన ఓ వీడియోను లోకేశ్‌ తన ట్విటర్‌లో పోస్టు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని