‘ఓటేసిన వారినే జగన్‌ కాటేస్తున్నారు’

తాజా వార్తలు

Published : 26/08/2020 11:31 IST

‘ఓటేసిన వారినే జగన్‌ కాటేస్తున్నారు’

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

అమరావతి: వైకాపాకు ఓటేసిన వారినే జగన్‌ కాటేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విటర్‌ వేదికగా ఆరోపించారు.  మధ్యపాన నిషేధం పేరుతో ప్రజలను దోచుకుంటున్న తీరుపై ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా నాయకుల బెదిరింపులు, పోలీసుల వేధింపులతోనే  ఓం ప్రకాష్ చనిపోయాడని ఆరోపించారు. ఓం ప్రకాశ్‌ మృతిపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదనా అని లోకేశ్‌ నిలదీశారు. ఎస్సీలపై జగన్ ప్రభుత్వం దాష్టీకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని