Nara lokesh: సీఎం సోదరికే రక్షణ కల్పించలేకపోతున్నారు: నారా లోకేశ్‌

తాజా వార్తలు

Published : 18/08/2021 01:42 IST

Nara lokesh: సీఎం సోదరికే రక్షణ కల్పించలేకపోతున్నారు: నారా లోకేశ్‌

కర్నూలు: ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరి ‘నాకు ఈ రాష్ట్రంలో రక్షణ లేదు’ అని చెప్పడం చరిత్రలో ఎప్పుడైనా చూశామా?అని తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ అన్నారు. కర్నూలు జిల్లా ఎర్రబాడు గ్రామానికి చెందిన షేక్‌ హాజీరా హత్య కేసును సీఎం జగన్‌ నీరుగారుస్తున్నారని లోకేశ్‌ విమర్శించారు.

‘‘అప్పట్లో ఆయేషా మీరా కేసును వైఎస్ఆర్‌‌, ఇప్పుడు హాజీరా కేసుని సీఎం జగన్‌ నీరుగార్చారు. హాజీరా హత్య జరిగి ఏడాది అయింది. అయినా ఏ పురోగతి లేదు. 21 రోజుల దిశ చట్టం ఎక్కడ? ఏడాదిగా హాజీరా తల్లి తన కూతుర్ని చంపిన వారికి శిక్ష పడాలని పోరాటం చేస్తున్నారు. ఆ తల్లి బాధ మీకు పట్టదా జగన్ రెడ్డి గారు?మహిళలపై తరచూ దాడులు జరుగుతూనే ఉన్నాయి.  స్వాతంత్య్రదినోత్సవం రోజున కూడా మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో లేదు. హాజీరా, ర‌మ్య‌, తేజ‌స్విని, స్నేహ‌ల‌త‌, వ‌ర‌ల‌క్ష్మిలు మీ కూతురిలాంటి వాళ్లు కాదా! వైఎస్ సునీతారెడ్డి నాకు ప్రాణ భయం ఉందని, రక్షణ కల్పించండని అడుగుతున్నారు. చెల్లికే రక్షణ కల్పించలేని వ్యక్తి రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారు?మహిళలపై వైకాపా నాయకుల దాడులు, వేధింపులకు లెక్కే లేదు.రెండేళ్ల మీ పరిపాలనలో ఒక్క మహిళకైనా న్యాయం జరిగిందా?ఒక్క నిందితుడికైనా శిక్ష పడిందా?ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి మహిళల రక్షణకి ప్రత్యేక ప్రణాళిక ప్రకటించాలి. హాజీరా కేసుని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి, హత్య చేసిన వారు ఎవరైనా 21 రోజుల్లో అరెస్ట్ చెయ్యాలి. హాజీరా కుటుంబానికి ప్రభుత్వం సహాయం చెయ్యాలి’’ అని డిమాండ్‌ చేశారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని