Narada Scam:మంత్రులు జైల్లో.. నేతలు ఆస్పత్రిలో
close

తాజా వార్తలు

Updated : 18/05/2021 12:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Narada Scam:మంత్రులు జైల్లో.. నేతలు ఆస్పత్రిలో

కోల్‌కతా: నారదా కుంభకోణం కేసులో సీబీఐ విచారణతో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అనేక నాటకీయ పరిణామాల అనంతరం ఈ కేసులో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు, మరో ఇద్దరు నేతలను అధికారులు అరెస్టు చేసి సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జైలుకు తరలించారు. అయితే మంగళవారం తెల్లవారుజామున ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, మాజీ మంత్రి సోవెన్‌ ఛటర్జీ జైల్లో అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అరెస్టయిన మంత్రులు ఫిర్హాద్‌ హకీమ్‌, సుబ్రతా ముఖర్జీ జైల్లోనే ఉన్నారు. 

నారదా వ్యవహారంలో ఈ నలుగురిపై దర్యాప్తునకు ఇటీవల గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు నిన్న ఉదయమే వారి ఇళ్లకు వెళ్లి అరెస్టు చేశారు. ఈ పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. అరెస్టులను వ్యతిరేకిస్తూ స్వయంగా సీఎం మమతా బెనర్జీ సీబీఐ కార్యాలయానికి వెళ్లి  నిరసన తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ నలుగురికీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సాయంత్రం బెయిల్‌ మంజూరు చేసింది. అయితే దీనిపై సీబీఐ వెంటనే హైకోర్టును ఆశ్రయించడంతో ఉన్నత న్యాయస్థానం బెయిల్‌ను రద్దు చేస్తూ స్టే ఇచ్చింది. 

మేం చెడ్డవాళ్లమే.. మరి వారు?

నారదా కేసులో సువేందు అధికారి, ముకుల్‌ రాయ్‌ పేర్లు కూడా ఉన్నాయి. స్టింగ్‌ ఆపరేషన్‌ జరిగిన సమయంలో వీరు తృణమూల్‌ నేతలు. ఇటీవల వీరిద్దరూ భాజపాలో చేరిన విషయ తెలిసిందే. అయితే ప్రస్తుతం వీరిని అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అరెస్టుకు ముందు ఎమ్మెల్యే మదన్‌ మిత్రా సీబీఐ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ భాజపాపై విరుచుకుపడ్డారు. ‘‘నన్ను వేధించేందుకు భాజపా ఎంతమందినైనా నియమించుకోనీ.. నాకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకముంది. మేమంతా చెడ్డవాళ్లమే అయితే మరి ముకుల్‌.. సువేందు?’’అని మిత్రా దుయ్యబట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని