బిహార్‌లో ఎన్డీయే @125

తాజా వార్తలు

Updated : 11/11/2020 04:49 IST

బిహార్‌లో ఎన్డీయే @125

బిహార్‌: తీవ్ర ఉత్కంఠ రేపిన బిహార్‌లో పూర్తి ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాల్లో ఎన్డీయే కూటమి మొదటి నుంచి స్పష్టమైన మెజారిటీని సాధించింది. దీంతో మరోసారి బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ పోరులో ఎన్డీయే కూటమి 125 స్థానాలు కైవసం చేసుకొని విజయ దుందుభి మోగించింది. మొత్తం 243 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన  మెజార్టీ (122 మార్కు)ని దాటేసి 125 స్థానాల్లో విజయం సాధించింది. తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని మహాకూటమి 110 స్థానాలు గెలిచి గట్టి పోటీ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఇతరులు ఏడు స్థానాల్లో విజయం సాధించగా.. ఎల్జేపీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. మరోవైపు, దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లోనూ భాజపా తన సత్తా చాటింది. తెలంగాణలోని దుబ్బాకలో సంచలన విజయం నమోదు చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని