Narayan Rane: నన్నేం చేయలేరు.. నేను మీకు భయపడను: రాణె

తాజా వార్తలు

Published : 26/08/2021 01:31 IST

Narayan Rane: నన్నేం చేయలేరు.. నేను మీకు భయపడను: రాణె

ముంబయి: తానెవరికీ భయపడనని, శివసేన వ్యక్తులు తననేమీ చేయలేరని కేంద్రమంత్రి నారాయణ రాణె అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో రాణెకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘శివసేన పెట్టిన అన్ని కేసుల్లో నాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ దేశం చట్టాలతో నడుస్తోందని చెప్పడానికి ఇదే నిదర్శనం. నేను చేసిన వ్యాఖ్యలకు వారికి(శివసేనను ఉద్దేశిస్తూ) ఎందుకు ఆగ్రహం వచ్చిందో అర్థం కావట్లేదు. గతంలో జరిగిన విషయాలను చెప్పడం కూడా నేరమేనా?’’ అని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని రాణె మరోసారి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. 

ఈ సందర్భంగా సీఎం ఠాక్రేపై మరోసారి విమర్శలు గుప్పించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చెప్పులతో కొట్టాలంటూ గతంలో ఠాక్రే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని సీఎంని చేశారంటూ ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌పై మండిపడ్డారు. వారు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కానప్పుడు తన వ్యాఖ్యలపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు. స్వదేశం పట్ల ఠాక్రే నిర్లక్ష్యంగా ఉన్నారని, అందుకే ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని అన్నారు. 

రాణెపై చర్యలు తీసుకోం: మహా సర్కారు

ఇదిలా ఉండగా.. కేంద్రమంత్రి రాణెపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోబోమని మహారాష్ట్ర ప్రభుత్వం నేడు బాంబే హైకోర్టుకు తెలిపింది. వివాదాస్పద వ్యాఖ్యలపై రాయ్‌గఢ్‌, ఇతర జిల్లాల్లో తనపై నమోదైన కేసులు కొట్టివేయాలంటూ రాణె హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు న్యాయస్థానం విచారణ చేపట్టగా.. ఆయనపై అరెస్టు వంటి చర్యలు తీసుకుబోమని ప్రభుత్వం తెలిపింది. దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబరు 17వ తేదీకి వాయిదా వేసింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని