close

తాజా వార్తలు

Updated : 02/03/2021 15:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేటీఆర్‌ సీఎం కావడం అసాధ్యం: ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌

హైదరాబాద్‌: తెరాస సర్కార్‌ ఏడేళ్ల పనితీరుకు ఎమ్మెల్సీ ఎన్నికలు రెఫరెండం అని భాజపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే సీఎం కేసీఆర్‌ రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు.ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు వీఆర్‌ఎస్‌ ఇవ్వడం ఖాయమని చురకలంటించారు.

నాయకత్వం తీరుతో తెరాస క్యాడర్‌ గందరగోళంగా ఉందన్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం చెప్పి ఓట్లు అడగాలో తెరాస పెద్దలకు అర్థం కావడం లేదని విమర్శించారు. ఉద్యోగాల లెక్కలపై మంత్రి కేటీఆర్‌ కాకి లెక్కలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగాల విషయంలో కేంద్రాన్ని విమర్శించే అర్హత తెరాసకు లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావటంపై స్పందిస్తూ.. ఆయన సీఎం కావడం అసాధ్యమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు భాజపాకు పూర్తి అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఎన్వీఎస్ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని