మా పార్టీనే మాకు కుటుంబం: నడ్డా

తాజా వార్తలు

Published : 18/11/2020 00:59 IST

మా పార్టీనే మాకు కుటుంబం: నడ్డా

భువనేశ్వర్‌: బిహార్‌ ప్రజలు గూండారాజ్‌ను తిరస్కరించి అభివృద్ధికి ఓట్లు వేశారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. గురువారం ఆయన ఒడిశాలో 2018 ఆగస్టు 5న శంకుస్థాపన చేసిన ఆరు భాజపా కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అభివృద్ధి అజెండాకు బిహార్‌ ప్రజలు ఆముద ముద్ర వేశారన్నారు. నరేంద్ర మోదీ విధానమైన సబ్‌కా సాత్‌ - సబ్‌కా వికాస్‌కు గట్టి మద్దతు తెలిపారన్నారు.

మంగళవారం ఆరు కార్యాలయాలను ప్రారంభించిన ఆయన.. నిర్మాణంలో ఉన్న మరో ఆరు భాజపా కార్యాలయాలను త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలిపారు. తమ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కొన్ని పార్టీలు ఇంటి నుంచే కార్యాలయాలు నిర్వహిస్తూ.. కుటుంబ పార్టీలుగా మారాయంటూ కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. తమకు మాత్రం పార్టీయే కుటుంబమన్నారు. 

2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత దేశ వ్యాప్తంగా 700 పార్టీ కార్యాలయాలు నిర్మించాలని ప్రతిష్ఠాత్మకంగా ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే 400  కార్యాలయాలు సిద్ధమయ్యాయయనీ.. మరో 200 కార్యాలయాల నిర్మాణ పనులు జరుగుతున్నట్టు చెప్పారు. మిగతా కార్యాలయాల నిర్మాణానికి భూ సేకరణ ప్రక్రియ జరుగుగుతున్నట్టు వివరించారు. క్యాడర్‌కు తగిన శిక్షణ ఇచ్చేందుకు కార్యాలయాలే తగిన చోటు అని ఆయన తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని