ప్రశ్నించడమే వెంగయ్య చేసిన తప్పా?: పవన్‌

తాజా వార్తలు

Updated : 19/01/2021 13:34 IST

ప్రశ్నించడమే వెంగయ్య చేసిన తప్పా?: పవన్‌

సమస్యలపై ప్రశ్నిస్తే ప్రాణాలు కోల్పోవాల్సిందేనా?
గిద్దలూరు ఎమ్మెల్యేపై క్రిమినల్‌ కేసు పెట్టాలన్న జనసేనాని

అమరావతి: ప్రకాశం జిల్లాలో జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్య నాయుడు ఆత్మహత్య బాధాకరమని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తమ గ్రామంలో కనీస సౌకర్యాల కల్పనపై గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును ప్రశ్నించినందుకు వెంగయ్య ప్రాణాలు తీసుకొనే పరిస్థితి రావడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. సింగరపల్లి గ్రామంలో పారిశుద్ధ్య, రహదారి, ఇతర సౌకర్యాలపై ఎమ్మెల్యేను వెంగయ్య ప్రశ్నించారని.. ఎమ్మెల్యే దీనికి సమాధానం ఇవ్వకపోగా అతడిని అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. సమస్యలపై ప్రశ్నించిన వెంగయ్యను ప్రజల మధ్యనే బెదిరించారని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా తన పార్టీ వ్యక్తుల ద్వారా వివిధ రూపాల్లో ఒత్తిళ్లకు గురి చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒత్తిళ్లు తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారని పవన్‌ ఆరోపించారు. 

‘‘గ్రామంలోని సౌకర్యాల కోసం ఎమ్మెల్యేను ప్రశ్నించడమే వెంగయ్య చేసిన తప్పా? కనీస సౌకర్యాల గురించి అడిగినందుకు ప్రాణాలు కోల్పోవాల్సిందేనా?’’ అని పవన్‌ నిలదీశారు. వెంగయ్య మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని.. బెదిరింపులకు గురిచేసి ఆయన్ను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎమ్మెల్యే, అతని అనుచరులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. వెంగయ్య ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని పవన్‌ భరోసా ఇచ్చారు. 

ఇవీ చదవండి..
నెల్లూరు ఎస్పీకి వైకాపా ఎమ్మెల్యే బెదిరింపులు

పాచిపెంట ఎస్సైపై యువకుల దాడిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని