అన్నయ్య నా విజయాన్ని కాంక్షించే వ్యక్తి: పవన్‌

తాజా వార్తలు

Updated : 30/01/2021 13:47 IST

అన్నయ్య నా విజయాన్ని కాంక్షించే వ్యక్తి: పవన్‌

అమరావతి: కులాలను ఓటు బ్యాంకుగా పరిగణించే కొద్దీ ఆయా వర్గాలకు శాసించే పరిస్థితి రాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాష్ట్ర జనాభాలో 27 శాతం ఉన్న కాపుల్ని ఓటు బ్యాంకుగా చూడటాన్ని ప్రతి రాజకీయ పార్టీ మానేయాలని హితవు పలికారు. కాపు సంక్షేమ సేన సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తుని ఘటనలో కాపులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. తాను ఓ కులానికి ప్రతినిధిని కాదని..అందరివాడినని చెప్పారు. ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నానన్నారు. ఉద్దానం కిడ్నీ, అమరావతిలో దళితుల సమస్యలపై పోరాడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులాల కార్పొరేషన్లు ఆయా వర్గాలకు తాయిలాలేనని పవన్‌ ఆరోపించారు. ఆయా వర్గాల నేతల రాజకీయ సాధికారిత వైపు చూడకుండా చేసే పన్నాగమే కార్పొరేషన్ల ఏర్పాటని వ్యాఖ్యానించారు. సోదరుడు చిరంజీవిని ఉద్దేశిస్తూ ఇటీవల జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ వెల్లడించిన నైతిక మద్దతు విషయాన్ని ఓ విలేకరి పవన్‌ వద్ద ప్రస్తావించగా.. ‘‘చిరంజీవి ఎప్పుడూ నా మేలుకోరే చెబుతారు. తమ్ముడిగా నా విజయం సాధించాలని ఆయన కోరుకుంటారు. మనస్ఫూర్తిగా నా విజయాన్ని ఆకాంక్షించే వ్యక్తి. దాన్ని అలాగే చూడాలి. ఆయన పార్టీలోకి వస్తారా లేదా అనేది ఈరోజే చెప్పలేను. అది చిరంజీవి గారి అభిప్రాయం’’ అని పవన్ అన్నారు.

ఇవీ చదవండి..

ప్రవీణ్‌ ప్రకాశ్‌ను తప్పించండి

ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌పై చర్యలు: నిమ్మగడ్డ Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని