అస్తవ్యస్తంగా ఏపీ ఆర్థిక వ్యవహారాలు: కేశవ్‌

తాజా వార్తలు

Updated : 10/07/2021 16:25 IST

అస్తవ్యస్తంగా ఏపీ ఆర్థిక వ్యవహారాలు: కేశవ్‌

అమరావతి: ఏపీ ఆర్థిక శాఖకు కేంద్రం రాసిన మరో లేఖను ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ విడుదల చేశారు. పరిధికి మించి రూ.17,923.94 కోట్ల మేర అప్పులు చేశారంటూ రాష్ట్ర ఆర్థిక శాఖకు జూన్‌ 30న కేంద్రం రాసిన లేఖను ఆయన బయటపెట్టారు. ఈ లేఖలో రుణాలు, కేంద్ర ఆర్థికశాఖ అభ్యంతరాలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పయ్యావుల డిమాండ్‌ చేశారు. కేంద్ర ఆర్థికశాఖ వివరణ కోరడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిందేనన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, కేంద్ర ఆర్థిక రాసిన లేఖతో స్పష్టమైందని చెప్పారు. రాష్ట్రం చేసే ఆర్థిక తప్పిదాలపై ముఖ్యమంత్రి కేంద్రానికి సమాధానం చెప్పాలని పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని