‘ప్రైవేట్‌ కంపెనీలా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు’

తాజా వార్తలు

Updated : 09/07/2021 12:07 IST

‘ప్రైవేట్‌ కంపెనీలా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు’

ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్

అమరావతి: గత రెండేళ్లల్లో వైకాపా ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అకౌంటింగ్ వ్యవహారాల్లో తప్పిదాలు జరిగాయని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన పయ్యావుల.. తన ఆరోపణలకు ఆధారంగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌కు కాగ్ రాసిన లేఖను జతచేశారు. గత రెండేళ్లల్లో ఆర్థిక శాఖలో జమా ఖర్చుల లెక్కలు అస్తవ్యస్తంగా ఉన్నందున జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన రికార్డులను స్పెషల్ ఆడిటింగ్ చేయించాలని కోరారు.

‘‘రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని గోప్యంగా ఉంచుతోంది. ఓ ప్రభుత్వ అధికారికి జీతం రావాలంటే వంద సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. అలాంటిది రూ.40 వేల కోట్లపైన బిల్లులకు ఎటువంటి రసీదులు, వోచర్లు లేకుండా నచ్చిన రీతిలో వివిధ పద్దుల్లోకి మార్చారు. ఒక ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ మాదిరిగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఆర్థిక కార్యదర్శులకు మాత్రమే పాస్‌వర్డ్‌ యాక్సెస్‌ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ లావాదేవీలన్నీ వారికి మాత్రమే తెలుస్తాయి. ప్రభుత్వ పరిధిలో ఉన్న ట్రెజరీ అండ్‌ ఆడిట్‌ డిపార్ట్‌మెంట్‌ లోపాలను ఎత్తి చూపిస్తుంది. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలకు ఎలాంటి రసీదులు లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తీరాలి’’ అని పయ్యావుల తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని