బుగ్గన అబద్ధాలు చెబుతున్నారు: పయ్యావుల

తాజా వార్తలు

Updated : 13/07/2021 17:43 IST

బుగ్గన అబద్ధాలు చెబుతున్నారు: పయ్యావుల

విజయవాడ: బ్యాంకు పూచీకత్తులపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బ్యాంకు గ్యారంటీల గురించి శాసనసభలో దాచారని విమర్శించారు. 

‘‘బ్యాంకు గ్యారంటీలపై ప్రశ్న అడిగితే ఏడాది తర్వాత జవాబు ఇచ్చారు. రూ.25వేల కోట్ల బ్యాంకు గ్యారంటీలను తెలియకుండా దాచారు. బ్యాంకు పూచీకత్తులపైనా అబద్ధాలు చెబుతున్నారు.  నా ఆరోపణలపై ప్రభుత్వం సరిగా జవాబు చెప్పలేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టులో ఛాలెంజ్‌ చేశాం. జీవోలో ఒకటుంది.. కోర్టుకు మరో విషయం చెప్పారు. దిల్లీకి లేఖ రాశారని ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి లేఖ రాయలేదు. దిల్లీ చుట్టూ ఎవరు ప్రదక్షిణలు చేస్తున్నారో అందరికీ తెలుసు. తప్పకుండా మేం దిల్లీ వెళ్లి వాస్తవాలు వివరిస్తాం. రాజ్యాంగం చెప్పినట్టు మీరు నడుచుకోవాలి. మీరు చేసిన అప్పులను ఇకనైనా పాదర్శకంగా చెప్పండి. మేం ప్రశ్నించినప్పుడు కనీసం శాసనసభకైనా జవాబు చెప్పాలి. పీఏసీ ఛైర్మన్‌, ప్రతిపక్షం ఎలా ఉండాలో మీరే చెబుతారా?’’ అని పయ్యావుల కేశవ్‌ ప్రశ్నించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని