ఎన్సీపీలోకి పీసీ చాకో..!

తాజా వార్తలు

Published : 17/03/2021 01:22 IST

ఎన్సీపీలోకి పీసీ చాకో..!

దిల్లీ: కాంగ్రెస్‌ అధిష్ఠానం వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ పార్టీని వీడిన సీనియర్‌ నేత పీసీ చాకో.. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ)లో చేరనున్నారు. ఈ మేరకు ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం సాయంత్రం చాకో.. పవార్‌ను కలవనున్నారు. ఈ భేటీలోనే ఆయన ఎన్సీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మీడియా సమావేశంలో పాల్గొంటారని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కేరళలోని అధికార లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఎల్‌డీఎఫ్‌) కూటమిలో ఎన్సీపీ భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో చాకో ఎల్‌డీఎఫ్‌ తరఫున ప్రచారం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

ఈ నెల 10న చాకో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలో వర్గపోరు నడుస్తోందని, ఇందులో కొనసాగడం కష్టమనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘ప్రస్తుతం నాయకత్వం లేని పార్టీగా కాంగ్రెస్‌ పనిచేస్తోంది. గడిచిన ఏడాది కాలంగా అధ్యక్షుడు లేకుండానే కాంగ్రెస్‌ ముందుకెళుతోంది. ఈ సమయంలో పార్టీ అధినాయకత్వాన్ని ఎవ్వరూ ప్రశ్నించడం లేదు’ అని పీసీ చాకో అన్నారు. కేరళ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విషయంలో పార్టీ.. రాష్ట్ర విభాగాన్ని సంప్రదించకపోవడంపై అసంతృప్తికి గురైన ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని