కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీసీ చాకో రాజీనామా!

తాజా వార్తలు

Updated : 10/03/2021 16:37 IST

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీసీ చాకో రాజీనామా!

దిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న వేళ కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే సీనియర్ల నుంచి అంతంత మాత్రమే మద్దతు ఉన్న కాంగ్రెస్‌కు, ఆ పార్టీ సీనియర్‌ నేత పీసీ చాకో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించినట్లు వెల్లడించారు. పార్టీలో వర్గపోరు నడుస్తోందన్న చాకో, ఇందులో కొనసాగడం కష్టమనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

‘ప్రస్తుతం నాయకత్వం లేని పార్టీగా కాంగ్రెస్‌ పనిచేస్తోంది. గడిచిన ఏడాది కాలంగా అధ్యక్షుడు లేకుండానే కాంగ్రెస్‌ ముందుకెళుతోంది. ఈ సమయంలో పార్టీ అధినాయకత్వాన్ని ఎవ్వరూ ప్రశ్నించడం లేదు’ అని పీసీ చాకో అభిప్రాయపడ్డారు. పార్టీ ప్రభావం రోజురోజుకు తగ్గిపోతోందన్న చాకో, ఇందుకు గుర్తుగా తన రాజీనామా నిలుస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా కేరళలో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విషయంలో పార్టీ రాష్ట్ర విభాగాన్ని సంప్రదించకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ చాకో వంటి సీనియర్‌ నేత పార్టీని వీడటం కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బే అని నిపుణులు భావిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని