TS News: ఏ ఒక్క హామీనీ తెరాస నెరవేర్చలేదు: ఉత్తమ్‌

తాజా వార్తలు

Published : 02/06/2021 13:16 IST

TS News: ఏ ఒక్క హామీనీ తెరాస నెరవేర్చలేదు: ఉత్తమ్‌

హైద‌రాబాద్‌: ఆరున్న‌ర ద‌శాబ్దాల తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను నెర‌వేర్చిన ఘ‌నత కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి ద‌క్కుతుంద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న గాంధీభ‌వన్‌లో జాతీయ జెండా ఎగుర‌వేశారు. అనంత‌రం మాట్లాడుతూ.. తెలంగాణను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఇచ్చినందుకు సోనియాగాంధీకి ప్రజల తరపున ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాన‌న్నారు. ఏడేళ్లుగా రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా పాల‌న జ‌ర‌గ‌డం లేద‌ని విమ‌ర్శించారు. విభ‌జ‌న హామీల అమలుపై కేంద్రాన్ని ప్ర‌శ్నించే ధైర్యం కేసీఆర్‌కు లేద‌న్నారు. కొవిడ్ క‌ట్ట‌డి విష‌యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాయ‌ని విమ‌ర్శించారు. 

ఏడేళ్ల‌లో తెలంగాణ స‌మాజానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా తెరాస నెర‌వేర్చ‌లేద‌ని ఉత్త‌మ్‌ ఆరోపించారు. ఉద్యోగ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌కుండా నిరుద్యోగుల‌ను మోసం చేశార‌ని ఆక్షేపించారు. నిరుద్యోగ భృతిపై ప్ర‌భుత్వంలో స్పంద‌న లేద‌న్నారు. రాష్ట్రంలో అవినీతి తారస్థాయికి చేరింద‌ని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చేలా కార్య‌కర్త‌లు స‌మష్టిగా కృషి చేయాల‌ని ఆయన పిలుపునిచ్చారు. గాంధీ భ‌వ‌న్‌లో జ‌రిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌ల్లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వీహెచ్‌, సీనియ‌ర్ నేత‌లు మ‌ధుయాష్కీ,, ష‌బ్బీర్ అలీ త‌దిత‌రులు పాల్గొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని