వారితో ప్రజలు విసిగిపోయారు: మోదీ 

తాజా వార్తలు

Updated : 03/04/2021 12:27 IST

వారితో ప్రజలు విసిగిపోయారు: మోదీ 

కొన్ని: కేరళలో అధికార ఎల్డీఎఫ్‌, ప్రతిపక్ష యూడీఎఫ్‌ కూటములపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ రెండు కూటములతో ప్రజలు విసిగిపోయారని, భాజపా అభివృద్ధి అజెండాను కోరుకుంటున్నారన్నారు. శుక్రవారం ఆయన పథనంతిట్ట జిల్లాలోని కొన్నిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శబరిమల అయ్యప్ప పుణ్యక్షేత్రం సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో ఆయన తన ప్రసంగానికి ముందు మూడు పర్యాయాలు స్వామియే శరణం అయ్యప్ప అని నినాదాలు చేశారు. 

అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌లను ప్రజలు ఇక చాలు.. చాలు అంటున్నారన్నారు. భాజపా, ఎన్డీయే అభివృద్ధి అజెండాను కేరళ ప్రజలు చూస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, విధానాలతో సంబంధాలు కలిగి ఉన్నారని ప్రధాని తెలిపారు. ప్రొఫెషనల్‌ కమ్యూనిటీ భాజపాను హర్షిస్తోందని, మెట్రోమ్యాన్‌ లాంటి విద్యావంతులను రాజకీయాల్లోకి తీసుకొచ్చే పార్టీ తమదేనన్నారు. క్రియాశీలత కలిగిన మెట్రోమ్యాన్‌ లాంటి ప్రొఫెషనల్స్‌ కేరళ రాజకీయాల్లో గేమ్‌ ఛేంజర్‌లు అవుతారన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని