రెచ్చగొట్టే ఉద్దేశం మాకు లేదు: పేర్నినాని
close

తాజా వార్తలు

Updated : 25/06/2021 16:33 IST

రెచ్చగొట్టే ఉద్దేశం మాకు లేదు: పేర్నినాని

అమరావతి: కృష్ణా జలాలపై భావోద్వేగాలు రెచ్చగొట్టే ఉద్దేశం ఏపీ ప్రభుత్వానికి లేదని.. ఇలాంటి వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాలకు ఎలాంటి ఉపయోగం ఉండదని మంత్రి పేర్ని నాని అన్నారు. రాజకీయాల కోసమే తెలంగాణ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం సహా పొరుగు రాష్ట్రాలతో సామరస్యంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి జగన్‌ విధానమన్నారు. జలాల వినియోగంపై సీఎం కేసీఆర్‌తో చర్చలు జరిపేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు. కృష్ణా నది నుంచి గ్లాసు నీరు కూడా అదనంగా తీసుకోవడం లేదని మంత్రి స్పష్టం చేశారు.

28 నుంచి అక్రిడేషన్ల ప్రక్రియ..

హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని జర్నలిస్టులకు అక్రిడేషన్ల ప్రక్రియను ఈ నెల 28 నుంచి ప్రారంభిస్తున్నట్లు పేర్ని నాని తెలిపారు. కమిటీ ఆమోదించిన వారిలో చాలా మందికి ఇప్పటికే కార్డులు జారీ చేశామని.. మిగతావారికి త్వరలోనే ఇస్తామన్నారు. కొత్త దరఖాస్తులు, మార్పు, చేర్పులకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. 40,442 మంది జర్నలిస్టులు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసుకున్నారని.. పెండింగ్‌లో ఉన్న వారి అక్రిడేషన్లను సోమవారం నుంచి పరిశీలించి జారీ చేస్తామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని