కాంగ్రెస్‌కు ఇక ‘రెడ్‌ కార్డే’ : మోదీ
close

తాజా వార్తలు

Published : 01/04/2021 14:10 IST

కాంగ్రెస్‌కు ఇక ‘రెడ్‌ కార్డే’ : మోదీ

దిల్లీ: అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కొక్రఝార్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. శాంతిభద్రతలు కల్పించే ఎన్డీఏకే ఇక్కడి ప్రజలు మరోసారి అధికారం కట్టబెడతారని వ్యాఖ్యానించారు.

‘అసోం యువతకు ఫుట్‌బాల్ ఆటపై అవగాహన ఎక్కువ. నేను వారి భాషలోనే కాంగ్రెస్ పరిస్థితి గురించి చెప్తాను. ఇక్కడి ప్రజలు మరోసారి కాంగ్రెస్‌, దాని కూటమికి ‘రెడ్ కార్డ్’ చూపిస్తారు. అభివృద్ధి, శాంతి భద్రతల కోసం ఎన్డీఏను విశ్వసిస్తారు’ అని మోదీ కాంగ్రెస్ కూటమిపై వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు అబద్ధాలకు, అభివృద్ధికి మధ్య పోరాటమని అని వ్యాఖ్యానించారు. ‘ఎన్నో ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ బాంబులు, తుపాకుల సంప్రదాయాన్ని రాష్ట్ర వాసులకు అంటగట్టింది. ఎన్డీఏ మాత్రం శాంతి, గౌరవాన్ని బహుమానంగా ఇచ్చింది’ అని ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. కాక్రఝార్‌లో ఏప్రిల్ ఆరున మూడో దశలో ఓటింగ్‌ జరగనుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రెండో దశ పోలింగ్ జరుగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని