రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం: మోదీ

తాజా వార్తలు

Updated : 24/02/2021 14:56 IST

రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం: మోదీ

దిల్లీ: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం సాధ్యమైనంత వరకు కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్రం తరపున ఇచ్చే పీఎం కిసాన్‌ పథకం ప్రారంభించి నేటికి రెండేళ్లు. ఈ సందర్భంగా ప్రధాని ట్విటర్‌ ద్వారా ఈ మేరకు స్పందించారు.

‘రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎంతో శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం పీఎం కిసాన్‌ను ప్రారంభించాం. మన రైతుల కృషి, పట్టుదల ఎంతో స్ఫూర్తిమంతం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చేందుకు గత ఏడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టింది. నీటి పారుదల సౌకర్యాలు పెంచడం, పంట బీమా, రుణాలు, సారవంతమైన నేలలు, మధ్యవర్తులను తొలగించడం వంటి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది. చరిత్రలో లేని విధంగా రైతుల పంటలకు మద్దతు ధరలను పెంచింది’ అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని