ఎన్నికల వేళ నాలుగు భాషల్లో మోదీ ట్వీట్లు
close

తాజా వార్తలు

Updated : 06/04/2021 12:07 IST

ఎన్నికల వేళ నాలుగు భాషల్లో మోదీ ట్వీట్లు

ఓటు హక్కు నివియోగించుకోవాలని అభ్యర్థన

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలో మంగళవారం ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రధాని మోదీ ఓటర్లును అభ్యర్థించారు. బెంగాలీ, మళయాళం, తమిళం, ఆంగ్లంలో ట్వీట్లు చేస్తూ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రికార్డు స్థాయిలో ఓటు శాతం నమోదు కావాలని, ముఖ్యంగా యువత ఓటు వేసేందుకు ముందుకు రావాలని పేర్కొన్నారు.

బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల్లో ఇవి మూడో విడత ఎన్నికలు. అస్సాంలో ఈ విడతతో పోలింగ్‌ పూర్తికానుంది. బెంగాల్‌లో నాలుగో విడత ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి.

నాలుగు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలోనూ ఈరోజు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 475 స్థానాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 20 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 9 గంటలకల్లా బెంగాల్‌లో 14.62 శాతం, అస్సాంలో 12.83 శాతం, తమిళనాడులో 13.8 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని