TS News: షర్మిల కాన్వాయ్‌ ఆపిన పోలీసులు
close

తాజా వార్తలు

Updated : 11/06/2021 13:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: షర్మిల కాన్వాయ్‌ ఆపిన పోలీసులు

పూడూరు: వికారాబాద్‌ జిల్లా పరిగి పర్యటనకు వెళ్తున్న వైఎస్‌ షర్మిల కాన్వాయ్‌ను పోలీసులు ఆపారు. పరిగిలో ధాన్యం కొనుగోళ్ల తీరును పరిశీలించేందుకు షర్మిల హైదరాబాద్ నుంచి వెళ్తుండగా పూడూరు మండలం అంగడిజితెంపల్లి గేటు వద్దకు రాగానే పోలీసులు ఆమె కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అనుమతులకు మించి వాహనాలు కాన్వాయ్‌లో ఉండటంతో వాటిని పక్కకు నిలిపేశారు. అనంతరం ఐదు వాహనాల చొప్పున అనుమతించారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని