AP News: తోట్లవల్లూరు వెళ్లకుండా కొల్లు రవీంద్రను అడ్డుకున్న పోలీసులు

తాజా వార్తలు

Updated : 21/10/2021 04:13 IST

AP News: తోట్లవల్లూరు వెళ్లకుండా కొల్లు రవీంద్రను అడ్డుకున్న పోలీసులు

కృష్ణా: తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు హైడ్రామా నడుమ నిన్నరాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం రాత్రి 10 గంటలకు తోట్లవల్లూరు పోలీసుస్టేషన్‌కు పట్టాభిరామ్‌ను తరలించారు. పోలీస్‌స్టేషన్‌ వద్ద పోలీసులు భారీ కేడ్లు ఏర్పాటు చేసి సమీపంలోకి ఎవరిని అనమతించలేదు. మరోవైపు మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర బుధవారం అర్ధరాత్రి దాటాక తోట్లవల్లూరుకు చేరుకున్నారు. దీంతో పోలీసులు రవీంద్రను అడ్డుకున్నారు. మీడియా సహా ఎవరూ రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఏపీ సీఎం జగన్‌ను పరుష పదజాలంతో దూషించినట్లు పట్టాభిరామ్‌పై గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పట్టాభిరామ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఎవరు చేశారన్నది మాత్రం వెల్లడికాలేదు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని