ఏపీ పురపోరు: బరిలో అక్కాచెల్లెళ్లు

తాజా వార్తలు

Published : 06/03/2021 14:17 IST

ఏపీ పురపోరు: బరిలో అక్కాచెల్లెళ్లు

ఆత్మకూరు: వారిద్దరూ సోదరీమణులు. ఒకరికొకరు ఆప్యాయంగా ఉండాల్సిన వారిద్దరూ పుర సమరంలో ప్రత్యర్థులుగా మారారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని 13వ వార్డులో అక్కాచెల్లెళ్ల పోటీ స్థానికంగా ఆసక్తి రేపుతోంది. ఆత్మకూరులోని 13వ వార్డు ఎస్సీ మహిళకు కేటాయించారు. తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ కౌన్సిలర్‌ శ్రీకాంత్‌ నారాయణ తన తల్లి లక్ష్మిని బరిలో నిలిపారు. ఇదే వార్డులో అధికార వైకాపా తరఫున లక్ష్మి చెల్లెలు పోటీకి దిగారు. అక్క గృహిణి కాగా చెల్లెలు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. సోదరీమణుల సమరంలో విజయం ఎవరిని వరిస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘గతంలో నా కుమారుడు శ్రీకాంత్‌ నారాయణ 13వ వార్డుకు ఎన్నో సేవలు చేశాడు. ప్రజలకు లోన్లు, పింఛన్లు ఇప్పించాడు. రోడ్లు వేయించాడు. ఈ వార్డుకు మా అబ్బాయి సేవ చేసినట్లుగానే, నేను కూడా సేవ చేయాలని నిర్ణయించుకున్నా’ అని తెదేపా అభ్యర్థి లక్ష్మి తెలిపారు. ‘13వ వార్డులోని సమస్యలు పరిష్కరించి, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని’ వైసీపీ అభ్యర్థి పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని