₹2కోట్లు నగదు.. 30వేల సెట్‌ టాప్‌ బాక్స్‌లు సీజ్‌ 
close

తాజా వార్తలు

Published : 19/03/2021 15:13 IST

₹2కోట్లు నగదు.. 30వేల సెట్‌ టాప్‌ బాక్స్‌లు సీజ్‌ 

పుదుచ్చేరి: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికల అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. కదిర్‌కామం, తట్టంచావడి, ఇందిరానగర్‌ నియోజకవర్గాలకు చెందిన అధికారులు తనిఖీల్లో భాగంగా ఓ వాహనాన్ని అడ్డుకున్నారు. ఆ వాహనంలో రూ.2కోట్ల నగదు తరలిస్తున్నట్టు గుర్తించి షాక్‌ అయ్యారు. ఈ సందర్భంగా చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి (సీఈవో) షుర్బీర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఈ నగదును బ్యాంకు నుంచి తీసుకెళ్తున్నట్టు చెబుతున్నప్పటికీ అందుకు సంబంధించి సరైన ఆధారాలు చూపించలేదన్నారు. ఓటర్లకు అక్రమంగా పంచేందుకే నగదు తరలిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. దీంతో నగదును సీజ్‌ చేసి తదుపరి విచారణ కోసం ఐటీ అధికారులకు అప్పగించినట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వాహనంలో స్వాధీనం చేసుకున్న నగదులో అన్నీ రూ.500, రూ.200, రూ.100 నోట్లే ఉన్నాయని పేర్కొన్నారు.

మరోవైపు, ఎంబాలం, నెట్టపక్కం, బహూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అధికారులు  ఓ ఇంటి నుంచి దాదాపు 30వేల సెట్‌ టాప్‌ బాక్సులను స్వాధీనం చేసుకున్నారని సీఈవో వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.2కోట్లు ఉంటుందని తెలిపారు. అలాగే, కరైకల్‌లో ఓ దుకాణం నుంచి 3600 లీటర్లకు పైగా మద్యాన్ని సీజ్‌ చేశామని, ఇప్పటివరకు పుదుచ్చేరిలో మొత్తంగా 18500 లీటర్ల మద్యం సీజ్‌ చేసినట్టు ఆయన వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని