TS news: సీఎం సమీక్షలు ఎన్నిక జరగబోయే నియోజకవర్గానికేనా..?: పొన్నాల

తాజా వార్తలు

Published : 03/08/2021 01:08 IST

TS news: సీఎం సమీక్షలు ఎన్నిక జరగబోయే నియోజకవర్గానికేనా..?: పొన్నాల

హైదరాబాద్‌: ‘కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రా... ఉప ఎన్నిక జరగబోయే నియోజకవర్గానికేనా?’ అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. సీఎం సమీక్షలు ఉప ఎన్నిక జరగబోయే నియోజకవర్గానికే పరిమితమైతే ఎలా? అని, సుదీర్ఘంగా కేబినెట్‌ భేటీ జరిగినా అధికారిక ప్రకటన కూడా రాలేదని పొన్నాల మండిపడ్డారు. నాగార్జునసాగర్‌ అభివృద్ధిపై మంత్రిమండలిలో చర్చించిన తర్వాత మళ్లీ హాలియాలో ముఖ్యమంత్రి సమీక్ష దేనికని అన్నారు. దీన్ని ప్రచార ఆర్భాటం అనకపోతే ఏమంటారో చెప్పాలన్నారు.

2014, 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై సమీక్షలు ఎందుకు లేవో సీఎం సమాధానం చెప్పాలని పొన్నాల డిమాండ్‌ చేశారు. హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక ఉందనే సాగర్‌లో సీఎం పర్యటించారని పొన్నాల ఎద్దేవా చేశారు. దళిత బంధును నియోజకవర్గానికి 100 కుటుంబాలకు చొప్పున అందిస్తే.. పథకం పూర్తిగా అమలయ్యేందుకు ఎన్నేళ్లు పడుతుందని పొన్నాల ప్రశ్నించారు.]


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని