టార్గెట్‌ 2022: అమరీందర్‌ సలహదారుగా పీకే
close

తాజా వార్తలు

Published : 02/03/2021 00:57 IST

టార్గెట్‌ 2022: అమరీందర్‌ సలహదారుగా పీకే

చండీగడ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ప్రధాన సలహాదారుగా ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ నియమితులయ్యారు. అమరీందర్‌ సింగే స్వయంగా ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. పంజాబ్‌ ప్రజలకోసం కలిసి పనిచేయబోతున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అమరీందర్‌ ప్రకటన వెలువడిన కాసేపటికే  సీఎంవో కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రశాంత్‌ కిషోర్‌కు కేబినెట్‌ హోదా ర్యాంకు కల్పిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. కేవలం ₹1 గౌరవ వేతనం అందిస్తున్నట్లు సీఎంవో కార్యాలయం ట్వీట్‌ చేసింది.

పంజాబ్‌లో 2022లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రశాంత్‌ కిషోర్‌ను అమరీందర్‌ సలహాదారుగా నియమించుకున్నట్లు తెలుస్తోంది. 2017 ఎన్నికల్లో పంజాబ్‌లో కాంగ్రెస్‌ గెలుపునకు అమరీందర్‌- పీకే కలిసి పనిచేశారు. ఆరు నెలల క్రితమే అమరీందర్‌ మళ్లీ పీకే సేవలను వినియోగించుకుంటారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ కెప్టెన్‌ అమరీందర్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటింది. మరోవైపు బెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ గెలుపుకోసం ప్రస్తుతం పీకే పనిచేస్తున్నారు. టీఎంసీదే గెలుపని ఆయన ధీమాగా చెబుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని