Prashant Kishor: పవార్‌తో పీకే భేటీ అందుకేనా?

తాజా వార్తలు

Published : 11/06/2021 15:05 IST

Prashant Kishor: పవార్‌తో పీకే భేటీ అందుకేనా?

ముంబయి: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ నేడు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో సమావేశం కానున్నారు. ముంబయిలోని పవార్‌ నివాసంలో వీరి భేటీ జరగనుంది. ఇటీవల జరిగిన బెంగాల్‌, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్‌ కిశోర్ తన వ్యూహాలతో మమతా బెనర్జీ, ఎం.కె.స్టాలిన్‌కు భారీ విజయాన్ని కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరివురికి మద్దతు ప్రకటించిన నేతలందరినీ కలిసి ప్రశాంత్‌ కృతజ్ఞతలు తెలపనున్నారని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగానే నేడు పవార్‌ను కలుస్తున్నట్లు పేర్కొన్నాయి. 

కానీ, రాజకీయ వర్గాల్లో మాత్రం పవార్‌, ప్రశాంత్‌ భేటీ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన చర్చ తెరమీదకు వచ్చింది. ‘మిషన్‌-2024’ లక్ష్యంగానే ఈ భేటీ జరగనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీని దీటుగా ఎదుర్కొనే ప్రతిపక్ష నేత ఎంపికపైనే చర్చించనున్నట్లు చర్చ జరుగుతోంది.

మరోవైపు ప్రస్తుతం తాను చేస్తున్న ‘ఎన్నికల వ్యూహరచన’ నుంచి తప్పుకోనున్నట్లు ప్రశాంత్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో తాను ఇప్పటికే విఫలమయ్యాయని.. తదుపరి ఏం చేయాలో ఆలోచించాల్సి ఉందన్నారు. అయితే, రాజకీయాల్లో ప్రశాంత్‌ కిశోర్‌ మరింత క్రియాశీలక పాత్ర పోషించనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని