close

తాజా వార్తలు

Published : 11/04/2021 02:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆడియో క్లిప్‌ దుమారం.. భాజపా Vs టీఎంసీ!

భాజపా ‘వంద’ మార్కును దాటలేదన్న ప్రశాంత్‌ కిషోర్‌

కోల్‌కతా:  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్‌, భాజపా తమ శక్తియుక్తుల్ని ప్రదర్శిస్తున్నాయి. విజయం తమదంటే తమదేనని ఇరు పార్టీలూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ మాట్లాడినట్లుగా చెబుతోన్న ఓ ఆడియో రికార్డింగ్‌ను భాజపా బయటపెట్టింది. అందులో ప్రశాంత్ కిశోర్ భాజపా గెలుపు గురించి మాట్లాడటం వినిపిస్తోంది. బెంగాల్‌లో నాలుగో విడత పోలింగ్‌ నేపథ్యంలో భాజపా విడుదల చేసినఈ ఆడియో క్లిప్‌పై దుమారం రేగుతోంది.

బెంగాల్‌లో సీఎం మమతకు ఉన్నంత ప్రజాదరణ ప్రధాని మోదీకి కూడా ఉన్నట్టు ప్రశాత్‌ కిషోర్‌ అన్నట్టుగా ఉన్న ఆడియో క్లిప్‌ను భాజపా విడుదల చేసింది. ప్రభుత్వ వ్యతిరేకత, మోదీకి దేశవ్యాప్తంగా అనుకూలంగా ఉన్న హిందీ ఓటర్ల పోలరైజేషన్‌, ఎస్సీ ఓటర్లంతా ఈసారి భాజపాకు అనుకూలంగా ఉన్నట్టు ప్రశాంత్‌ కిషోర్‌ అన్నట్టుగా ఆడియోను విడుదల చేసింది. క్లబ్‌ హౌస్‌కు సంబంధించి పాత్రికేయులతో ఆయన జరిపిన ఆడియో చాట్స్‌ సారాంశంపై స్పందించిన భాజపా ఐటీ సెల్‌ చీఫ్ అమిత్‌ మాలవీయ ఈ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి ఖాయమని తేలిపోయిందన్నారు. అయితే, తన పూర్తి చాట్‌ రికార్డింగ్‌ను సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేయాలంటూ ప్రశాంత్‌ కిషోర్‌ సవాల్‌ విసిరారు.

తమ నేతల ప్రసంగాల కంటే భాజపా తన ఆడియో చాట్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటోందని ప్రశాంత్‌ ఎద్దేవా చేశారు. తన ఆడియో చాట్‌లో తమకు అనుకూలంగా ఉన్న భాగాన్ని తీసుకొని భాజపా నేతలు సంబరపడిపోతున్నారని విమర్శించారు. బెంగాల్‌లో భాజపా 100 స్థానాలకు మించి గెలవదని, గతంలో చెప్పిన విషయాన్నే మళ్లీ చెబుతున్నట్టు ఆయన ట్వీట్‌ చేశారు. బెంగాల్‌లో శనివారం నాలుగో దశలో భాగంగా 44 నియోజకవర్గాల్లో ఓటింగ్ పూర్తయింది. ఈ ఎన్నికల్లో మొత్తం 1.15 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని