‘ఆమె ట్విటర్‌ వాద్రా.. కాంగ్రెస్‌కు మళ్లీ ఆ ఏడు సీట్లూ వస్తే గొప్పే!’

తాజా వార్తలు

Published : 25/10/2021 01:38 IST

‘ఆమె ట్విటర్‌ వాద్రా.. కాంగ్రెస్‌కు మళ్లీ ఆ ఏడు సీట్లూ వస్తే గొప్పే!’

లఖ్‌నవూ: ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ నుంచి తమకు ఎలాంటి ప్రమాదం లేదని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. ప్రియాంకను 'ట్విట్టర్ వాద్రా'గా అభివర్ణించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం టికెట్లను మహిళలకు కేటాస్తామని కాంగ్రెస్ ప్రకటించడంపై స్పందిస్తూ.. కాంగ్రెస్ తన ఏడు స్థానాలను తిరిగి నిలబెట్టుకుంటే అదే గొప్ప అని ఎద్దేవా చేశారు.

‘ఉత్తర్​ప్రదేశ్​లో కాంగ్రెస్‌కు ఉనికి లేదు. 2014 లోక్​సభ ఎన్నికల్లో ఇక్కడ రెండు సీట్లలో గెలిచారు. 2019లో అది ఒకటికే పరిమితమైంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏడు సీట్లే సాధించింది. 2022లో ఈ సీట్లు నిలబెట్టుకుంటే.. కాంగ్రెస్​కు అదే గొప్ప ఘనత అవుతుంది. ప్రియాంకను మీడియానే విపక్ష అభ్యర్థిగా చూస్తోంది. నేనైతే ప్రియాంకను ట్విట్టర్ వాద్రా అని భావిస్తా. ఫొటోలు దిగే నేతలు తప్ప.. కాంగ్రెస్​లో ఎవరూ లేరు. ప్రియాంక అయినా, రాహుల్ అయినా అంతే’ అంటూ పేర్కన్నారు.

సమాజ్​వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు కూడా భాజపా విజయానికి అడ్డుకాదని మౌర్య ధీమా వ్యక్తం చేశారు. 2017 ఎన్నికల్లో గెలిచిన స్థానాలను మళ్లీ సాధిస్తే.. వారు సంతోషించవచ్చని అన్నారు. ఈ పార్టీలు చేసిన అవినీతి, నేరాలు, మాఫియా రాజకీయాల గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ, ఎంఐఎం పార్టీలకు యూపీ ఎన్నికల్లో ప్రాధాన్యమే లేదని.. ఈ పార్టీలు ఓట్లను చీల్చేందుకే పోటీ చేస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపాకు ఎలాంటి సవాళ్లు ఎదురుకాబోవని మౌర్య అన్నారు. ఇచ్చిన హామీలను చాలా వరకు పార్టీ నెరవేర్చిందని, ఈసారి 325 కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని