Fuel price hike: కేంద్రంపై ప్రియాంక విమర్శలు

తాజా వార్తలు

Published : 12/06/2021 01:38 IST

Fuel price hike: కేంద్రంపై ప్రియాంక విమర్శలు

దిల్లీ: దేశంలో ఇంధన ధరలు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు.  పెట్రోల్‌, డీజిల్‌పై విధిస్తున్న పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్లు సేకరించడంతో పాటు అనేక పనులు చేయవచ్చన్నారు. కానీ, కేంద్రం అదేమీ చేయడంలేదని ఆక్షేపించారు. ఇంధన ధరల పెరుగుదలను నిరసిస్తూ  కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు దిల్లీలోని పలుప్రాంతాల్లో పెట్రోల్‌ బంక్‌ల వద్ద నిరసన చేపట్టారు. పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా ప్రియాంక ట్వీట్‌ చేశారు. కరోనా మహమ్మారి సమయంలో మోదీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ నుంచి పన్నుల ద్వారా రూ.2.74 లక్షల కోట్లు వసూలు చేసిందన్నారు. ఈ డబ్బుతో దేశం మొత్తానికి టీకాలు అందించడం (రూ.67వేల కోట్లు)తో పాటు 718 జిల్లాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు, 29 రాష్ట్రాల్లో ఎయిమ్స్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేయవచ్చని, అలాగే, 25కోట్ల మంది పేద ప్రజలకు రూ.6వేలు చొప్పున సాయం అందించవచ్చని తెలిపారు. కానీ, కేంద్ర ప్రభుత్వం అదేమీ చేయడంలేదంటూ ట్విటర్‌లో మండిపడ్డారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని