కరోనా టీకానే కాదు..ఈ ఇంజెక్షన్ కూడా..
close

తాజా వార్తలు

Published : 02/03/2021 01:14 IST

కరోనా టీకానే కాదు..ఈ ఇంజెక్షన్ కూడా..

గ్యాస్‌ ధరల పెంపుపై కాంగ్రెస్ ఆగ్రహం

దిల్లీ: ప్రధాని మోదీ కరోనా టీకా మొదటి డోసు తీసుకోవడాన్ని, వంటగ్యాస్ ధరల పెరుగుదలకు ముడిపెడుతూ కాంగ్రెస్ కేంద్రంపై విమర్శలు చేసింది. మరోసారి నిత్యావసర వస్తువైన వంటగ్యాస్ భారాన్ని వినియోగదారుడిపై మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. 

‘ప్రజలకు భాజపా నుంచి ధరల పెరుగుదల అనే మరో ఇంజెక్షన్ డోసు లభిస్తుంది’ అంటూ కాంగ్రెస్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. నేడు మరోసారి వంటగ్యాస్, వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. వంటగ్యాస్‌పై రూ.25, వాణిజ్య సిలిండర్‌పై రూ.95 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మూడు నెలల వ్యవధిలో గ్యాస్ బండపై రూ.225 పెరగడం గమనార్హం. ఈ పెంపును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  జీడీపీ(గ్యాస్ డీజిల్ పెట్రోల్‌) ధరల పెరుగుదలను అతి పెద్ద దోపిడీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని