దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేస్తాం
close

తాజా వార్తలు

Updated : 27/09/2020 11:48 IST

దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేస్తాం

కారంచేడు: భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా తనను ఎంపిక చేసిన అధిష్టానానికి కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కారంచేడులో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గురుతర బాధ్యత అప్పగించిన పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో భాజపాను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యమని వివరించారు. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని, అయినా.. ఆయా రాష్ట్రాల్లో భాజపాను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఏపీలో మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర పరిమితమని పురందేశ్వరి స్పష్టం చేశారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని