50వేల మంది నిరాశ్రయులయ్యారు: పవన్

తాజా వార్తలు

Published : 23/08/2020 02:36 IST

50వేల మంది నిరాశ్రయులయ్యారు: పవన్

అమరావతి: గోదావరి ముంపు ప్రాంతాల ప్రజల బాధలు ఆవేదన కలిగిస్తున్నాయని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పసిపిల్లలకు పాలు కూడా దొరకడం లేదన్నారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుపరిచి సరైన వైద్యం అందించాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ముంపు ఇంతలా ఉండేది కాదన్న ఆయన త్వరితగతిన ప్రాజెక్టు పనులు చేయాలని కోరారు.

200 లంక గ్రామాలు మునిగిపోయాయని పవన్‌కల్యాణ్‌ వివరించారు. దీంతో 50వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని తెలిపారు. వైద్యులు అందుబాటులో లేరని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో చిన్న పిల్లలు పాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అత్యవసర వస్తువుల జాబితాలో పాలు కూడా చేర్చాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన  కోరారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని