గాంధేయ మార్గంలో పోరాడాలి: రఘురామ

తాజా వార్తలు

Published : 27/08/2020 14:01 IST

గాంధేయ మార్గంలో పోరాడాలి: రఘురామ

దిల్లీ: నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. గరువారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కళ్లుండి మనసులేని ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలను కళ్లు లేని మనసున్న న్యాయస్థానాలు న్యాయం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. గాంధేయమార్గంలో న్యాయంకోసం పోరాటం చేయాలని అమరావతి రైతులకు సూచించారు. 

అమరావతి రైతుల పక్షాన అన్యాయానికి వ్యతిరేకంగా  మహిళలు చక్కటి పోరాటం చేస్తున్నారని అభినందించారు. అన్యాయంపై అమరావతి రైతులు పాక్షికంగా విజయం సాధించారన్నారు. స్టేటస్‌ కో ఆర్డర్‌ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో అతిథిగృహం నిర్మాణానికి పూనుకోవడం దుస్సాహసమేనని వ్యాఖ్యానించారు. కోర్టుల్లో 70కి పైగా మొట్టికాయలు పడినప్పుడు తప్పులు సరిదిద్దుకోవాల్సిన అవసరముందని  రఘురామకృష్ణరాజు అన్నారు. నీలం సంజీవరెడ్డి, ఎన్‌ జనార్థన్‌రెడ్డి హయాంలో కోర్టులు చిన్న కామెంట్‌ చేశాయని రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని