నలంద కిషోర్‌ది ముమ్మాటికీ పోలీసు హత్యే 

తాజా వార్తలు

Updated : 25/07/2020 13:08 IST

నలంద కిషోర్‌ది ముమ్మాటికీ పోలీసు హత్యే 

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు

దిల్లీ: విశాఖలో నలంద కిషోర్‌ మృతి తనను ఎంతగానో బాధించిందని నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. శనివారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నలంద కిషోర్‌ది ముమ్మాటికీ పోలీసు హత్యేనని ఆరోపించారు.

‘‘సోషల్‌ మీడియాలో మెసేజ్‌ ఫార్వర్డ్‌ చేసినందుకే ఆయనపై కసులు పెట్టి వేధించారు. కిషోర్‌ పెట్టిన పోస్టుల్లో ఎవరి పేరూ లేకపోయినా పోలీసులు అరెస్టు చేసి కర్నూలు తీసుకెళ్లారు. ఆరోగ్యం బాగా లేకున్నా విశాఖ నుంచి కర్నూలుకు కారులో తరలించారు. కిషోర్‌ను తరలించిన సమయంలో కర్నూలులో కరోనా కేసులు ఉద్ధృతంగా ఉన్నాయి. కరోనాతోనే కిషోర్‌ చనిపోయినట్టు నా మిత్రుల ద్వారా తెలిసింది. కావాలనే అయన్ను కర్నూలు తీసుకెళ్లి కరోనా అంటించారు. ఇది ముమ్మాటికీ పోలీసు హత్యగానే భావించాలి. 

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారు. జీవించే హక్కును కూడా మా ప్రభుత్వం హరింపజేస్తుందా?. ప్రభుత్వానికి సూచనలు చేశానన్న కారణంగా నాపై కూడా అనర్హత పిర్యాదు చేశారు. ఇలాంటి విషయాల్లో పోలీసులను ప్రోత్సహించవద్దని కోరుతున్నా. పోలీసుల దమనకాండను ప్రభుత్వాధినేతగా జగన్‌ ఆపేయాలి. స్నేహితుడిని పోగొట్టుకున్న వ్యక్తిగా బాధతో మాట్లాడుతున్నా. గతంలో సామాజిక మాధ్యమాల్లో వైకాపా తరఫున పెట్టిన పోస్టులపై ప్రశ్నిస్తే జగన్‌ విమర్శించారు. సహించలేని స్థితికి వెళ్తే ప్రజలు ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలో భావప్రకటన, జీవించే హక్కు లాంటి ప్రాథమిక హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ఇదంతా సీఎంకి తెలిసి జరుగుతుందో... తెలియక జరుగుతుందో అనే అనుమానం కలుగుతోంది. సంక్షేమ పథకాలు కాదు.. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఇందుకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి’’ అని రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు.

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కేసులో కూడా కోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఆలోచనలో లేనట్టు సమాచారం ఉందని తెలిపారు. జస్టిస్‌ కనగరాజ్‌తో మరో పిటిషన్‌ వేయించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసిందని చెప్పారు.

 

 

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని