‘‘పీవీకి నివాళిపై ఏపీ సీఎంకు లేఖ రాయండి’’
close

తాజా వార్తలు

Updated : 28/07/2020 17:14 IST

‘‘పీవీకి నివాళిపై ఏపీ సీఎంకు లేఖ రాయండి’’

ప్రజలకు పిలుపునిచ్చిన వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

దిల్లీ: మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహరావు  సంస్కరణల వల్లే దేశం ఈ స్థాయిలో ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. పీవీ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోనూ పీవీకి ఘనంగా నివాళులు అర్పించాల్సిందన్నారు. ఇదే విషయాన్ని సీఎం జగన్‌కు తెలియజేశానని చెప్పారు. పీవీకి ఘన నివాళి విషయంలో ప్రజలు కూడా సీఎంకు లేఖలు రాయాలని పిలుపునిచ్చారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై రఘురామకృష్ణరాజు తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు చెబుతున్న విషయం తెలిసిందే. తాజాగా పీవీ విషయంలోనూ ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని