Rahul Gandhi: సూరత్‌ కోర్టుకు హాజరైన రాహుల్‌
close

తాజా వార్తలు

Updated : 24/06/2021 14:00 IST

Rahul Gandhi: సూరత్‌ కోర్టుకు హాజరైన రాహుల్‌

సూరత్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంటిపేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యకు గానూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ గురువారం గుజరాత్‌లోని సూరత్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో విచారణకు హాజరయ్యారు. పరువు నష్టం కేసులో తుది వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన నేడు న్యాయస్థానానికి వచ్చారు. 

2019 ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో రాహుల్‌ ఓ ప్రచార సభలో మాట్లాడుతూ ప్రధాని ఇంటిపేరును కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పట్లో ఇది వివాదానికి దారితీసింది. మొత్తం మోదీ కమ్యూనిటీని రాహుల్ అవమానించారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే సూరత్‌ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, భాజపా నేత పూర్ణేష్‌ మోదీ ఆయనపై పరువునష్టం దావా వేశారు. 

ఈ కేసులో తుది వాంగ్మూలం ఇచ్చేందుకు ఈ నెల 24న కోర్టుకు హాజరు కావాల్సిందిగా సూరత్‌ చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ గతవారం రాహుల్‌ను ఆదేశించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయన నేడు కోర్టు ఎదుట హాజరయ్యారు. కాగా.. ఇదే కేసులో 2019 అక్టోబరులో రాహుల్‌ న్యాయస్థానానికి వచ్చి తాను నిరపరాధినని చెప్పారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని