సరిహద్దులో..యథాతథస్థితి లేకుంటే శాంతి కష్టమే!

తాజా వార్తలు

Published : 11/02/2021 18:30 IST

సరిహద్దులో..యథాతథస్థితి లేకుంటే శాంతి కష్టమే!

బలగాల ఉపసంహరణపై రాహుల్‌ గాంధీ

దిల్లీ: భారత్‌-చైనా సరిహద్దులో ఇంతకుముందున్న యథాతథస్థితి లేకుంటే శాంతి, ప్రశాంత వాతావరణమూ లేనట్లేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. సైనికుల త్యాగాలను ఎందుకు అవమాన పరుస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆయన, భారత భూభాగాన్ని వదిలేస్తోందని విమర్శించారు. బలగాల ఉపసంహరణపై చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నామని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంట్‌లో వెల్లడించిన నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో స్పందించారు.

తూర్పు లద్దాఖ్‌ సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా ఇరు దేశాలు భారీ సంఖ్యలో బలగాలను మోహరించాయి. రెండు దేశాలు కూడా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు దాదాపు 50వేల చొప్పున సైనికులను మోహరించినట్లు సమాచారం. దీంతో గతకొంతకాలంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, పలు దఫాల్లో సైనికాధికారులు, విదేశాంగశాఖ చర్చల ఫలితంగా తాజాగా ఇరు దేశాలు ఓ ఏకాభిప్రాయానికి వచ్చాయి. దఫాల వారీగా సరిహద్దుల్లో బలగాలు వెనక్కి వెళ్లేందుకు అంగీకరించాయి. అయితే, ఈ ఒప్పందం వల్ల భారత్‌ ఏమీ నష్టపోలేదని.. చైనాకు అంగుళం భూమి కూడా వదిలేది లేదని పార్లమెంట్‌ వేదికగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టంచేశారు. సరిహద్దు నుంచి బలగాల ఉపసంహరణపై చైనా కూడా ఇప్పటికే స్పందించింది.

ఇవీ చదవండి..
చైనాకు అంగుళం భూమి కూడా ఇవ్వం
గల్వాన్‌లో 45మంది చైనా జవాన్ల మృతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని