శవాలు తేలుతుంటే.. సెంట్రల్‌ విస్టానే కన్పిస్తోందా?
close

తాజా వార్తలు

Published : 12/05/2021 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శవాలు తేలుతుంటే.. సెంట్రల్‌ విస్టానే కన్పిస్తోందా?

దిల్లీ: దేశంలో కరోనా విలయం కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్‌ భవనం పనులు చేపట్టడాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. నదుల్లో శవాలు తేలుతుంటే ప్రధానికి మాత్రం సెంట్రల్‌ విస్టానే కన్పిస్తోందంటూ సోషల్‌మీడియా వేదికగా మోదీపై ధ్వజమెత్తారు. ‘‘నదుల్లో లెక్కలేనన్ని శవాలు తేలుతున్నాయి.. ఆసుపత్రుల ముందు వైరస్‌ బాధితులు మైళ్ల కొద్దీ లైన్లలో వేచి చూస్తున్నారు. ప్రజలు జీవించే హక్కును కోల్పోతున్నారు..! మోదీజీ.. ఆ గులాబీ రంగు గాగుల్స్‌ తీసేయ్యండి.. వాటివల్ల మీకు సెంట్రల్‌ విస్టా తప్ప మరేమీ కన్పించట్లేదు’’ అని రాహుల్‌ ట్విటర్‌లో మండిపడ్డారు. 

బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ సరిహద్దుల్లోని బక్సర్‌ ప్రాంతంలో గంగానదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు తేలియాడుతూ కన్పించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అవన్నీ కొవిడ్‌ రోగుల మృతదేహాలై ఉండొచ్చని స్థానిక అధికారులు భావిస్తున్నారు.  

ఓవైపు దిల్లీలో ఆంక్షలు ఉన్నప్పటికీ.. నూతన పార్లమెంట్‌ భవన సముదాయం సెంట్రల్‌ విస్టా నిర్మాణం కొనసాగుతుండటంపై కాంగ్రెస్‌ గత కొన్ని రోజులుగా విమర్శలు చేస్తూనే ఉంది. ఈ నిర్మాణంపై స్టే విధించాలంటూ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలైంది. దీనిపై న్యాయస్థానం నేడు విచారణ జరపనుంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని