ఆత్మనిర్భర్‌ అంటే అదే..: రాహుల్‌

తాజా వార్తలు

Published : 14/09/2020 10:40 IST

ఆత్మనిర్భర్‌ అంటే అదే..: రాహుల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: పార్లమెంట్‌ వర్షాకాలం సెషన్‌ ప్రారంభానికి ముందే కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అధికార భాజపాపై మండిపడ్డారు. కరోనావైరస్‌ వ్యాప్తి కట్టడిలో పూర్తిగా విఫలం కావడంతో ఆ ఫలితం ప్రజలు అనుభవిస్తున్నారన్నారు. మోదీ అహంకారం వల్ల ఇలా జరిగిందని తప్పుపట్టారు. ఈ మేరకు ఆయన సెషన్‌కు కొద్ది సేపుముందు ఓ ట్వీట్‌ చేశారు. 
‘‘ఈ వారంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 50 లక్షలు దాటనుంది. అదే సమయంలో యాక్టీవ్‌ కేసులు కూడా 10 లక్షలు మార్కును చేరనున్నాయి. వ్యక్తిగత అహంకారంతో ఓ వ్యూహాం లేకుండా లాక్డౌన్‌ విధించారు. ఫలితంగా కరోనా ఇప్పుడు దేశంలో విజృంభించింది. మోదీ ప్రభుత్వం చెప్పే ఆత్మనిర్భరం అర్థం ఏమిటో తెలుసా.. ప్రధాని మోదీ నెమళ్లతో ఆడుకుంటుంటే మరోపక్క మీ ప్రాణాలు మీరు కాపాడుకోవడం’’ అని ఆయన ట్విటర్‌లో ప్రభుత్వ పనితీరును ఎద్దేవా చేశారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని