Politics: అలాంటి అంశాలపై రాజకీయమా? రాహుల్‌ ఖాతాను మళ్లీ బ్లాక్‌ చేయండి!

తాజా వార్తలు

Published : 18/08/2021 01:36 IST

Politics: అలాంటి అంశాలపై రాజకీయమా? రాహుల్‌ ఖాతాను మళ్లీ బ్లాక్‌ చేయండి!

భాజపా డిమాండ్‌

దిల్లీ: దేశ రాజధాని నగర శివారులో ఇటీవల జరిగిన తొమ్మిదేళ్ల దళిత బాలికపై హత్యాచార ఘటనను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రాజకీయం చేస్తున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. ఇలాంటి ఘటనల్లో బాధితుల ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేయరాదని, ఆయా అంశాలను స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయం చేయరాదన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేసే ముందు వారి అంగీకారం తీసుకున్నట్టు చెప్పడాన్ని వారు ఖండించారని, అందువల్ల రాహుల్‌ ఖాతాను మరోసారి బ్లాక్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

మరోవైపు, రాహుల్‌ గాంధీ విశ్వసనీయత కోల్పోయారని, అబద్ధాలను ఓ అలవాటుగా మార్చుకున్నారని భాజపా జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ పొలిటికల్‌ ఖాతాను లాక్‌ చేశారని, ఇప్పుడు ట్విటర్‌ కూడా ఆయన ఖాతాను లాక్‌ చేయాలని వ్యాఖ్యానించారు.

దళిత బాలిక కుటుంబాన్ని ఇటీవల పరామర్శించిన సందర్భంలో ఆ చిత్రాలను ట్విటర్‌లో  పోస్ట్‌ చేయడంతో రాహుల్‌ ఖాతాను తాత్కాలికంగా బ్లాక్‌ చేసిన విషయం తెలిసిందే. నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఆయన ఖాతాను బ్లాక్‌ చేసినట్టు ట్విటర్‌ వివరణ ఇచ్చింది. ట్విటర్‌ పక్షపాతంతో వ్యవహరిస్తోందని, దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోందంటూ రాహుల్‌ ట్విటర్‌ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ మరుసటి రోజే ఆయన ఖాతాను ట్విటర్‌ పునరుద్ధరించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని