‘రాహుల్‌ను స్కూల్‌కు పంపాలి’
close

తాజా వార్తలు

Published : 09/03/2021 17:29 IST

‘రాహుల్‌ను స్కూల్‌కు పంపాలి’

దిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని స్కూల్‌కు పంపించాలని కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఏ శాఖలు, ఏయే విభాగాలో ఉంటాయో ఆయన తెలుసుకోవాలంటూ ఎద్దేవాచేశారు. మత్స్య రంగానికి మంత్రిత్వశాఖ ఉండాలంటూ రాహుల్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గిరిరాజ్‌ ఈ విధంగా స్పందించారు. లోక్‌సభలో చర్చ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సమాఖ్య వ్యవస్థలో కేంద్రం పరిధిలో ఏయే మంత్రిత్వశాఖలు, విభాగాలు ఉంటాయో రాహుల్‌ తెలుసుకోవాలని సూచించారు. ఇదే విషయం గతంలో తాను చెప్పినా ఆయన గుర్తుపెట్టుకోవడం లేదని తప్పుబట్టారు.

ఇటీవల కేరళ, పుదుచ్చేరి పర్యటన సందర్భంగా మత్స్య రంగానికి మంత్రిత్వశాఖ ఉండాలని రాహుల్‌ వ్యాఖ్యానించారు. దీన్ని మోదీ, అమిత్‌షా సహా ఇతర మంత్రులు సైతం తప్పుబట్టారు. ఇప్పటికే పశుసంవర్థకం, డెయిరీ శాఖలో భాగంగా ఉందని చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే రాహుల్‌ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై రాహుల్‌ మళ్లీ స్పందిస్తూ ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో గిరిరాజ్‌ ఈ విధంగా స్పందించారు. మోదీ అధికారంలోకి వచ్చాక మత్స్యరంగం 10.87 శాతం వృద్ధి సాధించిందని, కాంగ్రెస్‌ హయాంలో ఇది 5.27 శాతంగా మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని