లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత మార్పు 
close

తాజా వార్తలు

Published : 11/03/2021 18:31 IST

లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత మార్పు 

దిల్లీ: లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేతగా రవ్‌నీత్‌సింగ్‌ బిట్టూ నియమితులయ్యారు. పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలకు అధిర్‌ రంజన్‌ చౌధురి స్థానంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయన్ను  నియమించింది. పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న అధిర్‌..  మరో రెండు నెలల వరకు ప్రచారంలో పాల్గొననుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రవ్‌నీత్‌సింగ్‌ బిట్టూ పంజాబ్‌ మాజీ సీఎం బియాంత్‌ సింగ్‌ మనవడు. మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన గతేడాది ఆగస్టులో లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ విప్‌గా నియమితులయ్యారు. 45 ఏళ్ల రవ్‌నీత్‌ మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో పంజాబ్‌లోని ఆనంద్‌పూర్‌ సాహిబ్‌ నుంచి, 2014, 2019 ఎన్నికల్లో లుధియానా నుంచి గెలిచారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా నియమితులైన రవ్‌నీత్‌కు పంజాబ్‌ కాంగ్రెస్‌ అభినందనలు తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని