AP News: రఘురామపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు.. స్పందించిన ఆర్‌బీఐ

తాజా వార్తలు

Published : 24/10/2021 01:17 IST

AP News: రఘురామపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు.. స్పందించిన ఆర్‌బీఐ

అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌కు బ్యాంకు రుణాల మంజూరులో అవకతవకలపై విచారణ జరపాలంటూ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాసిన లేఖపై రిజర్వు బ్యాంకు స్పందించింది. మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటూ విజయసాయిరెడ్డికి ఆర్‌బీఐ సీజీఎం జయశ్రీగోపాలన్‌ లేఖ రాశారు. విజయసాయిరెడ్డి రాసిన లేఖలోని వివిధ అంశాలు పరిశీలనలో ఉన్నాయని, నిబంధనలకు అనుగుణంగా లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌కు బ్యాంకు రుణాల అవకతవకలపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు ఈ ఏడాది జూలై 21న ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని