ఎన్నికలకు ముందే ప్రత్యేక హోదా పునరుద్ధరించాలి

తాజా వార్తలు

Published : 27/06/2021 01:11 IST

ఎన్నికలకు ముందే ప్రత్యేక హోదా పునరుద్ధరించాలి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ముందే ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) నాయకుడు ఒమర్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 370 అధికరణ రద్దును కేంద్రం వెనక్కి తీసుకునేవరకు గుప్కార్‌ కూటమి రాజీ పడబోదని స్పష్టం చేశారు. ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన శనివారం వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌ అంశంలో రాజ్యాంగ హక్కుల కోసం చట్టబద్ధంగా, రాజకీయంగా, శాంతియుతంగా పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో గుప్కార్ కూటమి అజెండాకు విరుద్ధంగా చర్చకు వచ్చిన ఏ అంశంపైనా తాము మాట్లాడలేదన్నారు.  సుదీర్ఘ ప్రయత్నం తర్వాత అధికరణ 370ని రద్దు చేయడంలో భాజపా సఫలమైందని పేర్కొన్నారు. తాము కూడా ఎంత కాలమైనా ప్రత్యేకహోదా పునరుద్ధరణపై వెనక్కి తగ్గబోమని నొక్కి చెప్పారు. జమ్మూకశ్మీర్‌ అంశంలో ఇచ్చిన హామీలను గత ప్రధానులెవ్వరూ నెరవేర్చకపోవడంతో తాము కేంద్రంపై విశ్వాసం కోల్పోయామన్నారు. కేంద్రం, జమ్మూకశ్మీర్‌ మధ్య ఏర్పడిన అంతరాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. 

జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఎన్నికలు నిర్వహిస్తామని సమావేశానికి హజరైన రాజకీయ పార్టీల నాయకులతో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. 
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని