close

తాజా వార్తలు

Published : 05/03/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాహుల్‌పై ఈసీకి భాజపా ఫిర్యాదు 

దిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై తమిళనాడు భాజపా నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వచ్చే నెల 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆయన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రచారం చేయకుండా ఆయనపై నిషేధం విధించాలని కోరారు. మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం కావాలంటూ యువతను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని నేతలు కోరారు. మార్చి 1న కన్యాకుమారి జిల్లా ములగుమూడులోని సెయింట్ జోసెఫ్‌ పాఠశాలలో రాహుల్‌ గాంధీ రాజకీయ ప్రచారం నిర్వహించారంటూ భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జి బాలచంద్రన్‌ ఆరోపించారు. విద్యాసంస్థలో రాజకీయ ప్రచారం చేసిన రాహుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మెమోరాండం సమర్పించారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని