Revanth reddy: శశిథరూర్‌పై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా: రేవంత్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 17/09/2021 04:27 IST

Revanth reddy: శశిథరూర్‌పై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆయనపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు రేవంత్‌ పేర్కొన్నారు. శశిథరూర్‌ను తాను అత్యంత గౌరవించే వ్యక్తినన్నారు. తన వ్యాఖ్యలపై శశిథరూర్‌కు వివరణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో విధానాలు, విలువలతో పనిచేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి అందరం కృషిచేస్తామన్నారు. ఇటీవల పార్లమెంటరీ ఐటీ స్థాయి సంఘం ఛైర్మన్‌ హోదాలో హైదరాబాద్‌ వచ్చిన శశిథరూర్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. ఇదే విషయంపై రేవంత్‌రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు.  మరోవైపు తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శశిథరూర్‌ స్పందించారు. రేవంత్‌రెడ్డి చింతిస్తున్నట్లు తనకు చెప్పారని శశిథరూర్‌ పేర్కొన్నారు. తెలంగాణలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ బలోపేతం కావడానికి మేమందరం ఒక్కటిగా కలిసి పనిచేస్తామన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని