TS politics: తెరాస, భాజపా రెండూ ఒక్కటే: రేవంత్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 01/08/2021 05:09 IST

TS politics: తెరాస, భాజపా రెండూ ఒక్కటే: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: ఈద్‌ మిలాప్‌ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌ అలీ, అంజన్‌కుమార్‌ యాదవ్‌, దాసోజు శ్రవణ్‌, జావిద్‌, ఫిరోజ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ...  ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు ఇచ్చి విద్య, ఉద్యోగాల్లో అభివృద్ధి చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వం అని గుర్తు చేశారు. తెరాస, భాజపా ఒక్కటేనన్న రేవంత్‌.. భాజపాకు అన్ని అంశాలలో తెరాస మద్దతు ఇచ్చిందన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఏడేళ్లయిందని విమర్శించారు. రెండు పడకగదుల ఇళ్లు ఇస్తామని చెప్పి .. ఇచ్చారా?అని ప్రశ్నించారు. ముస్లింల హక్కుల కోసం కొట్లాడే వాళ్ల వెంటే మేముంటామని స్పష్టం చేశారు. ఒక్క అవకాశం ఇవ్వండి తెలంగాణ, దిల్లీలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేద్దాం అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని